సర్ప్రైజ్: ‘హరిహర వీరమల్లు’ కోసం నారా లోకేష్ క్రేజీ పోస్ట్ వైరల్!

HHVm

టాలీవుడ్ కి పవర్ స్టార్ ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న తాజా చిత్రమే “హరిహర వీరమల్లు”. తన నుంచి ఎన్నికల్లో సక్సెస్ అయ్యాక వస్తున్న మొదటి సినిమా ఇది కాగా దీనిపై సాలిడ్ హైప్ ఇపుడు కనిపిస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు లానే భారీ ఓపెనింగ్స్ కి రంగం సిద్ధం అవ్వగా సినిమా విడుదల ముందు పవన్ కోసం ప్రముఖ రాజకీయ నాయకుడు అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఇంకా ఏపీ ఐటీ శాఖా మంత్రి, నారా లోకేష్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

పవన్, హరిహర వీరమల్లు కోసం లోకేష్ ఏమన్నారంటే

“మా పవన్ అన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”. అని తెలిపారు.

అభిమానుల ఆనందం

నారా లోకేష్ నుంచి ఈ తరహా పోస్ట్ ఒకటి పవన్ కోసం వస్తుంది అని ఎవరూ ఊహించకపోవడంతో ఇపుడు వారి అభిమానులు సోషల్ మీడియాలో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు చెబుతున్నారు.

Exit mobile version