ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ రీసెంట్ థ్రిల్లర్!

Maargan

కోలీవుడ్ నుంచి వచ్చి తెలుగు ఆడియెన్స్ మన్ననలు కూడా అందుకున్న అతి కొద్ది మంది హీరోస్ లో బిచ్చగాడు నటుడు విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. అక్కడ నుంచి తన ప్రయోగాత్మక చిత్రాలతో అలరిస్తూ వస్తున్న విజయ్ రీసెంట్ గా చేసిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే “మార్గన్”. తెలుగు సహా తమిళ్ లో డీసెంట్ రన్ ని అందుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది.

దీనితో మార్గన్ చిత్రం ఈ జూలై 25 నుంచి అందుబాటులోకి రానుంది అని కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా తెలుగు ఇంకా తమిళ్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు ఈ సినిమాని చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ సంగీతం సహా నిర్మాణం కూడా అందించారు.

Exit mobile version