బ్రాడ్ పిట్ ‘ఎఫ్ 1’ కి ఇండియాలో రికార్డు వసూళ్లు

F1 the movie

మళ్ళీ చాలా కాలం తర్వాత హాలీవుడ్ సినిమా నుంచి వరుసగా క్రేజీ చిత్రాలు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి. అలా ఈ ఏడాదిలోనే నెల గ్యాప్ లోనే మూడుకి సినిమాలు వచ్చాయి. ఇలా వచ్చిన చిత్రాల్లో నటుడు సీనియర్ హీరో బ్రాడ్ పిట్ నటించిన రేసింగ్ థ్రిల్లర్ చిత్రం “ఎఫ్ 1” కూడా ఒకటి. అయితే మొదటి రోజు నుంచే సాలిడ్ టాక్ తో మంచి వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మన దగ్గర కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

ఇండియా వైడ్ మంచి నిలకడ కొనసాగిస్తూ ఇపుడు రికార్డు మార్క్ 100 కోట్ల గ్రాస్ ని అందుకుంది అంటే చిన్న విషయం కాదు. ఎలాంటి సూపర్ హీరో సినిమా కాదు లేదా ఏదైనా పాపులర్ ఫ్రాంచైజ్ సినిమా కూడా కాకపోయినప్పటికీ ఈ చిత్రం ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం అనేది గమనార్హం. ఇక ఫైనల్ రన్ ఎక్కడ వరకు వెళుతుంది. ఇక ఈ చిత్రాన్ని జోసెఫ్ కొన్సిస్కి దర్శకత్వం వహించగా బ్రాడ్ ఫిట్ తో పాటుగా యువ నటుడు డామ్సన్ ఐడ్రిస్ కూడా నటించాడు.

Exit mobile version