తేజ సజ్జ ‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ అయ్యింది!

Mirai

మన టాలీవుడ్ ఫస్ట్ ఎవర్ సూపర్ హీరో.. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా “ఈగల్” సినిమాతో మన టాలీవుడ్ లోకేష్ కనగరాజ్ అనిపించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కలయికలో చేస్తున్న భారీ పాన్ వరల్డ్ లెవెల్ చిత్రమే “మిరాయ్”. వరల్డ్ క్లాస్ విజువల్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని అనౌన్స్ చేసేసారు.

హను మాన్ కి వర్క్ చేసిన సంగీత దర్శకుడు గౌర హరి ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తుండగా వైబ్ ఉంది అనే ఫస్ట్ సింగిల్ ని ఈ జూలై 26న విడుదల చేస్తున్నట్టుగా లీడ్ జంటపై మంచి పోస్టర్ తో అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా భాషల్లో ఈ సాంగ్ ని ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version