‘భీమ్లా నాయక్’ అంత పెద్ద హిట్టా.. పవన్ ఫస్ట్ టైం హాజరైన పార్టీ!

bheemla nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం హరిహర వీరమల్లు చిత్రం ఇప్పుడు గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది. అయితే చాలా రీమేక్ సినిమాలు తర్వాత పవన్ నుంచి రాబోతున్న స్ట్రైట్ సినిమా ఇది కావడంతో మంచి హైప్ ఉంది. అలాగే ఈ సినిమా అనుకున్న టైం కే వచ్చి ఉంటే ఇప్పటికి మించి సాలిడ్ ఓపెనింగ్స్ ఉండి ఉండేవి. అయితే పవన్ కెరీర్ లో సినిమా సక్సెస్ అయ్యాక పార్టీలు చేసుకున్నది కానీ వెళ్ళింది కానీ లేదని తెలిపారు.

అయితే తన లైఫ్ లో ఒక్క పార్టీకి మాత్రం వెళ్లానని చెప్పుకొచ్చారు. అదే “భీమ్లా నాయక్” చిత్రానికత. ఈ సినిమాకి మాత్రం అంత తక్కువ టికెట్ ధరలో కూడా బాగా డబ్బులు చేసిందని టీం పార్టీ ప్లాన్ చేసి పిలిస్తే ఆ కారణం చేత వెళ్లానని చెప్పుకొచ్చారు. సో భీమ్లా నాయక్ పెద్ద హిట్టే అనుకోవాలి. ఇక హరిహర వీరమల్లు విషయానికి వస్తే నేడు గ్రాండ్ ప్రీమియర్స్ తో రేపు ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ తో సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version