హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’. ఈ చిత్రం శుక్రవారం విడుదలై బాక్స్ ఆఫీసు దగ్గర మిశ్రమ ఫలితాలు రాబట్టుకోవడంతో రాజమౌళి సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని రాజమౌళి గారు సాయి కొర్రపాటి కలిసి నిర్మించారు. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టొరీ ద్వారా నవీన్, రాహుల్ మరియు లావణ్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. ‘ అందాల రాక్షసి’ చిత్రానికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి మరియు మంచి రివ్యూస్ రాశారు. ఈ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ఈ చిత్రం మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది, శని మరియు ఆది వారం వచ్చే కలెక్షన్స్ ను చూసి సోమవారం ఈ చిత్రం గురించి ఒక నిర్ణయానికి రావొచ్చని’ రాజమౌళి ట్వీట్ చేశారు. అందాల రాక్షసి చిన్న చిత్రమే అయినా సహా నిర్మాతగా రాజమౌళి మరియు డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఈ చిత్రంలో భాగంగా చేరాక ఈ చిత్రం మీద అంచనాలు పెరిగిపోయాయి. జి మురళి అందించిన సినిమాటోగ్రఫి మరియు రథన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్. బాక్స్ ఆఫీసు దగ్గర ఈ చిత్రానికి కలెక్షన్లు ఇలానే ఉంటాయా లేదా అనేదానికోసం ఇంకొంత కాలం వేచి చూడాలి.