జక్కన్నకు రామ్ లీలా ట్రైలర్ నచ్చిందట

జక్కన్నకు రామ్ లీలా ట్రైలర్ నచ్చిందట

Published on Sep 21, 2013 3:00 AM IST

Rajamouli
దర్శకధీరుడు రాజమౌళి మనకు అద్భుతమైన సినిమాలను అందించడమే కాక ఇతర టెక్నిషియన్స్ టాలెంట్ ను ట్విట్టర్ లో మెచ్చుకునే పనిలో కూడా వుంటాడు. ప్రస్తుతం అతనిని ‘రామ్ లీలా’ ట్రైలర్ ఆకట్టుకుంది.

‘రామ్ లీలా’ సినిమా సంజయ్ లీలా భన్సాలి తెరకేక్కిస్తున్నాడు. ఈ మధ్యే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ప్రముఖులందరూ ఈ ట్రైలర్ ను ట్విట్టర్ లో ప్రశంశించారు. రాజమౌళి సంజయ్ లీలా భన్సాలీ ట్విట్టర్ లో ట్రైలర్ అద్బుతమైన విజువల్స్ అని, ప్రతీ ఫ్రేమ్ నిజంగా కనులవిందు అని మెసేజ్ చేసాడు.

ఈ చర్యల ద్వారా ‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ లో క్రేజ్ వస్తుందేమో చూడాలి. ఆయన తీసిన ‘మగధీర’ మరియు ‘ఈగ’ సినిమాలు అక్కడ ప్రేక్షకులనుండి విశేష స్పందనను అందుకున్నాయి.

తాజా వార్తలు