సడన్ స్టార్ ని అభినందించిన రాజమౌళి


టాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ రాజమౌళి సడన్ స్టార్ మరియు అతని టీంకి అభినందనలు తెలియజేసారు. ఇంతకీ ఈ సడన్ స్టార్ ఎవరని ఆలోచిస్తున్నారా.. ఇంకెవరూ మన కామెడీ కింగ్ అల్లరి నరేష్ గారే సడన్ స్టార్. అల్లరి నరేష్ సుడిగాడు చిత్రంతో సడన్ స్టార్ అనే టైటిల్ ని వేసుకున్నారు. ‘భీమనేని శ్రీనివాస్ గారు మీకు మరియు మీ టీంకి శుభాకాంక్షలు. అల్లరి నరేష్ కెరీర్లో టాప్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం కంటే రెండు రెట్లు ‘సుడిగాడు’ చిత్రం కలెక్ట్ చెయ్యాలని కోరుకుంటున్నానని’ రాజమౌళి ట్వీట్ చేసారు.

హిట్ చిత్రాలకు పేరడీగా తీసిన ‘సుడిగాడు’ చిత్రం చాలామంది నటుల నుంచి మరియు సినీ ప్రముఖుల నుండి మన్ననలు అందుకుంటోంది. మంచి కామెడీతో మరియు ఎవరినీ కించ పరచకుండా పేరడీ చేసి సినిమా తీయడమే ఇంతమంది అభినందనలు అందుకోవడానికి గల కారణం.

రాజమౌళి ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం పనిచేస్తున్నారని మేము ఐడి వరకే తెలిపాము.

Exit mobile version