ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ లతో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ వండర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఈ చిత్రాన్ని రాజమౌళి ఏ రేంజ్ లో అయితే తెరకెక్కిస్తున్నారో అంచనాలు కూడా అంతకు మించిన స్థాయిలోనే నెలకొన్నాయి.
అయితే ఈ చిత్రం తాలూకా తారాగణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు జక్కన. అటు బాలీవుడ్ నుంచి మరియు ఫారిన్ నుంచి క్యాస్టింగ్ ను దింపాడు. ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్స్ చేస్తున్న ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ ల విషయంలో జక్కన స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది.
అలాగే ఇప్పటికే ఎవరి డబ్బింగ్ వారే చెప్పుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే తెలుగు డబ్ విషయంలో రాజమౌళి వారి చేత ఆ భాషల మాడ్యులేషన్ ను ఒడిసి పట్టేలా వారి పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. అందుకే వారి కోసం స్పెషల్ క్లాసులు కూడా అరేంజ్ చేసారని సినీ వర్గాల్లో గాసిప్.
ఈ ఇద్దరి ఫిమేల్ లీడ్స్ కూడా ఈ చిత్రంలో చాలా కీలక పాత్ర పోషించనున్నాయి. మరి ఈ ఇద్దరి తెలుగు డబ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే జక్కన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.