కాస్త ముందే “పుష్ప”రాజ్ స్టార్ట్ చేస్తాడా?

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరక్కిస్తున్న చిత్రం “పుష్ప”. వీరి కాంబోలో వస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం తాలూకా షూట్ లాక్ డౌన్ మూలాన వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు ఎట్టకేలకు షూటింగ్ మొదలు కావడానికి సర్వం సిద్ధం అయ్యింది. అయితే ఈ షూట్ ను ఈ నవంబర్ మొదటి వారముల చిత్ర యూనిట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మొదటగా సినిమా షూట్ ను ఈ నవంబర్ 6న ప్లాన్ చెయ్యగా ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓ రోజు ముందు 5నే స్టార్ట్ అవ్వనున్నట్టు తెలుస్తుంది.

అలాగే ఈ మొదటి రోజు షూట్ నుంచే బన్నీ కూడా పాల్గొని నిర్విరామంగా నెల రోజుల పాటు సాగించనున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Exit mobile version