పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు పరిశ్రమలో ప్రత్యేకమయిన హీరోనే ఇప్పడు “గబ్బర్ సింగ్” విజయంతో పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలందరు పవన్ చుట్టూ డేట్స్ కోసం తిరుగుతున్నారు ఒకానొక ప్రముఖ నిర్మాత మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ తిరిగి ఫాంలోకి వస్తే అతన్ని ఎవరు ఆపలేరు బాక్స్ ఆఫీస్ స్థితిగతులని మార్చేస్తాడు కాబట్టి ప్రస్తుతం పరిశ్రమలో పేరొందిన నిర్మాతలందరి కన్నులు పవన్ కళ్యాణ్ డేట్స్ మీదే ఉంటాయి” అని అన్నారు. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రాలు ఇప్పటికే కొన్ని నిర్ణయించబడ్డాయి ఈ పోటీ అంతా ఈ చిత్రాల తరువాత ఆయన డేట్స్ గురించి త్వరలో పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “కెమరామాన్ రాంబాబుతో గంగ” చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా “గబ్బర్ సింగ్” బాక్స్ ఆఫీస్ మీద తన ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చరీష్మ ఫ్రెండ్స్.