‘విశ్వంభర’లో మెగా ట్రీట్‌గా మారనున్న రీమిక్స్ సాంగ్..?

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ‘విశ్వంభర’ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించేస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వశిష్ట సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.

అయితే, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని.. దీని షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ పాటను చిరంజీవి నటించిన ‘అన్నయ్య’ చిత్రంలోని ‘ఆట కావాలా పాట కావాలా’కు రీమిక్స్ వెర్షన్ అని వార్తలు వినిపించాయి. కానీ, ఇప్పుడు ఈ పాట చిరంజీవి నటించిన ఖైదీ చిత్రంలోని ‘రగులుతోంది మొగలిపొద’ అనే పాటకు రీమిక్స్ వెర్షన్ అని తెలుస్తోంది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ మెగాస్టార్‌తో కలిసి చిందులు వేయనుంది.

ఇక ఈ పాటలో మౌనీ రాయ్ అందాల విందు అభిమానులను కట్టిపడేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయనున్నాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే తెలుస్తుంది.

Exit mobile version