అభిరుచిగల చిత్రాలు ఎంచుకొనే హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ మొదటిసారి నిర్మాతగా మారి తనే హీరోగా చేస్తున్న చిత్రం ‘కో అంటే కోటి’. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ కథానాయికగా నటిస్తోంది. ప్రియా ఆనంద్ ఈ చిత్ర మొదటి షెడ్యూల్ కి సంభందించిన చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఈ చిత్రానికి అనీష కురువిల్ల దర్శకత్వం వహిస్తున్నారు. ‘ కో అంటే కోటి సినిమా మొదటి షెడ్యూల్ చివరి దశకు చేరుకుంది ఇంత తొందరగా పూర్తవడం నేను నమ్మలేకుంటా ఉన్నాను. ఈ చిత్ర టీంని కొన్ని రోజులు మిస్ అవుతున్నాను అని’ ప్రియా ఆనంద్ ట్వీట్ చేసారు. ఇటీవలే ఈ చిత్ర బృందంలోని వారికి వైరల్ జ్వరం రావడంతో నటీనటులు కంగారు పడ్డారు కానీ అక్కడున్న డాక్టర్లు జోక్యం చేసుకొని శ్రద్ధ వహించడంతో తొందరగా కోలుకున్నారు. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ప్రియా చెన్నైకి బయలుదేరింది. చెన్నైలో త్వరలోనే విడుదల కానున్న తన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్ర ప్రమోషన్లలో పాల్గొననుంది. శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ మధ్యలో ఈ చిత్రాన్ని టొరంటో ఫెస్టివల్ లో ప్రదర్శింహనున్నారు మరియు ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.