ఫిబ్రవరి 8న ట్రైలర్ తో రానున్న ‘ప్రెజర్ కుక్కర్’ !

సుజయ్ – సుశీల్ దర్శకత్వంలో సాయి రోనాక్ – ప్రీతీ ఆష్రాని జంటగా ఫన్నీ టైటిల్ తో పాటు మంచి కాన్సెప్ట్ తో కొత్తగా రాబోతున్న చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 8న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇక ఫిబ్రవరి 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఏపి మరియు తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్ మంచి ఎమౌంట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా మనిషి జీవితంలో ముఖ్యమైన అంశాలు జాబ్, చదువు, ప్రేమ, పెళ్లి వంటి ప్రధాన విషయాలతో జనం ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొకుంటున్నారనే థీమ్ ఆధారంగా ఈ ‘ప్రెజర్ కుక్కర్’ చిత్రం పూర్తి వినోదభరిత చిత్రంగా తెరకెక్కిందట.

కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాల పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అన్నపరెడ్డి అప్పిరెడ్డి, సుజోయ్, సుశీల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మంచి కంటెంట్ తో వస్తే చిన్న సినిమాలను కూడా బాగా ఆదరిస్తోన్న రోజులు ఇవి. మరి అలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడలి.

Exit mobile version