మనోజ్ కెరీర్లో బెస్ట్ గ్రాసర్ పోటుగాడు

మనోజ్ కెరీర్లో బెస్ట్ గ్రాసర్ పోటుగాడు

Published on Sep 22, 2013 2:32 PM IST

potugadu-collections
మంచు మనోజ్ హీరోగా నటించిన ‘పోటుగాడు’ సినిమా గత శుక్రవారం విడుదలై అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తక్కువ రన్ టైం, ఫుల్ ఎంటర్ టైన్మెంట్, సూపర్బ్ సాంగ్స్ ఈ సినిమాకి హెల్ప్ అవ్వడం అలాగే అందరి విమర్శకుల నుంచి పాజిటివ్ గా రివ్యూస్ రావడం సినిమాకి హెల్ప్ అవుతుంది.

ఈ రోజు ఈ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసాడు. అందులో మనోజ్ హీరోగా నటించి 100 రోజులు ఆడిన సినిమాల కలెక్షన్ ని పోటుగాడు సినిమా రెండు రోజుల్లో కలెక్ట్ చేసింది, అలాగే వారి బ్యానర్ లో వచ్చి 175 రోజులు ఆడిన ‘ఎవడిగోల వాడిది’ సినిమా కలెక్షన్స్ ని కూడా రెండు రోజుల్లో క్రాస్ చేసిందని తెలిపారు.

కన్నడలో ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన పవన్ వడియార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్ ముండి, అను ప్రియ గోయెంక, రేచల్ హీరోయిన్స్ గా కనిపించారు. అచ్చు సంగీతం అందించాడు.

తాజా వార్తలు