మనోజ్ కెరీర్ లోనే ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్లు సాదించిన ‘పోటుగాడు’

మనోజ్ కెరీర్ లోనే ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్లు సాదించిన ‘పోటుగాడు’

Published on Sep 15, 2013 7:45 PM IST

Potugadu-Latest-Posters-1

మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ పోటుగాడు’ నిన్న ఆంద్రప్రదేశ్ అంతట విడుదలైంది. విడుదలైన అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్ లు ఆంధ్రప్రదేశ్ లో రెండు కోట్లు దాటింది. ఇది మనోజ్ కెరీర్ లో ఓపెనింగ్ లోనే ఎక్కువ కలెక్షన్ లు సాదించిన సినిమా ఇది. దీనిలో ఒక్క నైజాంలోనే అంతట బంద్ లు వున్న 98 లక్షల మార్క్ ను సాదించింది . ఈ సిమాంద్ర బందులు లేకుండా వుంటే మొదటి రోజున మరో కోటి రూపాయలు సాదించెదని బావిస్తున్నారు. ఈ సినిమా వీకెండ్ శనివారం విడుదల కావడం కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ అయ్యింది. ఈ రోజు కూడా అన్ని ఏరియాలలో కలెక్షన్లు బాగానే వున్నాయని సమాచారం. ఇదే విదంగా ఈ వారం మొత్తం కలెక్షన్ లను సాదిస్తే మనోజ్ కెరీర్ లో అతి ఎక్కువ కలెక్షన్ లు వసూలు చేసిన సినిమా ఇదే అవుతుంది.

తాజా వార్తలు