భారత చలన చిత్ర రంగంలో రీమేక్ ల పరంపర కొనసాగుతోనే ఉంది. గత కొద్ది కాలంగా చాలా చిత్రాలు ఇలానే వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ చిత్ర నిర్మాతలు దక్షిణాది చిత్రాలను రీమేక్ చెయ్యడానికి మక్కువ చూపుతున్నారు. గత సంవత్సరం విజయాన్ని అందుకున్న ‘పిజ్జా’ చిత్రం కూడా రీమేక్ చేసే చిత్రాలలో ప్రస్తుతం నిలిచింది.
హిందీలో కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకో ఆసక్తి కర విషయం ఏమిటంటే ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కుమారుడు అక్కినేని అక్షయ్ ఈ చిత్రాన్ని చేస్తున్నారు.
అక్షయ్ ఒబెరాయ్, పార్వతి ఓమనకుట్టన్ లు ఈ చిత్రం లో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఏప్రిల్ నెలాఖరున విడుదల చేయనున్నారు.