పాయల్ యుద్ధ విమానాలు నడుపుతుందట.

సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాన్జీ తెరకెక్కిస్తున్న చిత్రం నరేంద్ర. నీలేష్ ఎతి హీరోగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కీలక రోల్ దక్కించుకున్నారు. నరేంద్ర సినిమాలో ఆమె లేడీ పైలట్ ఫైటర్ గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు జరిగింది. అంటే పాయల్ ఈ చిత్రంలో యుద్ధ విమానాలను నడిపే లేడీ ఫైటర్ రోల్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు గ్లామర్ రోల్స్ చేసిన పాయల్ ఏకంగా లేడీ పైలట్ గా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నారు.

నరేంద్ర మూవీ ఆఫ్ఘనిస్థాన్ లో బందీగా ఉన్నమాజీ బాక్సింగ్ ఛాంపియన్ స్టోరీ. రెస్లింగ్ ఛాంపియన్ ది గ్రేట్ కలి ఈ చిత్రంలో ఓ రోల్ చేయడం విశేషం. ఇక మరో హీరోయిన్ ఇసాబెల్లా లైట్ హ్యూమన్ రైట్స్ యాక్టీవిస్ట్ రోల్ చేస్తున్నారు. ఇషాన్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version