పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి అభిమానులకి సూపర్ కిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీఎంట్రీ మొదటి చిత్రంగా పవన్ బాలీవుడ్ చిత్రం ‘పింక్’ను రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఎలాంటి ఆలస్యం లేకుండా మే 15న వేసవి కానుకగా విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు.
ఇక ఉగాది రోజున టైటిల్ ఏమిటనేది కూడా రివీల్ చేయనున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల మేరకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి మేకర్స్ దీన్నే ఫైనల్ చేస్తారా లేకపోతే వేరే ఏదైనా కొత్త టైటిల్ పెడతారా అనేది చూడాలి. ఇకపోతే పవన్ క్రిష్ డైరెక్షన్లో ఒక సినిమాను స్టార్ట్ చేసి హరీష శంకర్ దర్శకత్వంలో ఇంకో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.