ఎట్టకేలకు పవన్ లుక్ మార్చాడు.. మెస్మరైజ్ అవుతున్న ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో అభిమానులకు ఎక్కువగా నచ్చేది ఆయన స్టైలిష్ లుక్స్. ఎప్పుడూ ఒకేలా ఉన్నట్టు కనిపించినా ఆన్ స్క్రీన్ మీద ఆయన్ను చూస్తే అభిమానుల్లో కలిగే హుషారే వేరు. అయితే ఇటీవల రాజకీయాల్లోకి వెళ్లిన అయన లుక్స్ మీద శ్రద్ద తగ్గించారు. ‘వకీల్ సాబ్’ సినిమాకు సైన్ చేసిన తర్వాతే పవన్ గడ్డం, లాంగ్ హెయిర్ తీసేసి ట్రిమ్ లుక్ చేసుకున్నారు. మళ్ళీ ఈమధ్య లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో పవన్ మళ్ళీ గడ్డం పెంచేసి కనిపించారు. కొన్ని నెలల తరబడి ఆయన్ను అలా చూసి చూసి అభిమానులకు బోర్ కొట్టింది.

అందుకే కొత్త లుక్ ట్రై చేస్తే చూడాలనుకున్నారు. కొందరైతే ఇంతలా మారిపోయారు మళ్ళీ పాత లుక్ రావడం కుదిరే పనేనా అనుకున్నారు. కానీ పవన్ అందరికీ షాకిస్తూ పాత లుక్ లో సరికొత్తగా కనిపంచారు. ‘వకీలు సాబ్’ సూటి ఉండటం త్వరలో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనుండటంతో పద్దతిగా పాత లుక్ తెచ్చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. ఫ్యాన్సీ కాస్ట్యూమ్ లో ఆయన్ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ లుక్ లో సినిమా చేస్తే హిట్ పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version