నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తన కొత్త చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్” ప్రమోషన్లలో బిజీగా ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా ఈ సినిమా నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూ జరుగుతుండగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల సర్ప్రైజింగ్గా వచ్చి రష్మికను కలుసుకుంది. ఇద్దరూ కొంతసేపు ముచ్చటిస్తూ, సరదా క్షణాలను పంచుకున్నారు. ఆ అందమైన క్షణాలను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ సమయానికి శ్రీలీల కూడా తన తాజా చిత్రం “మాస్ జాతర” ప్రమోషన్లలో పాల్గొంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


