తమ అభిమాన హీరో కోసం ఎంతవరకు వెళ్లగలిగే అభిమానులు మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా ఉన్నారు. ఏ రంగంలో అయినా పవన్ అడుగు జాడల్లో నడిచి పాటించే వారు ఎలా అయితే ఉన్నారో వారి అత్యుత్సాహం తో పవన్ కు దెబ్బేసే వారు కూడా లేకపోలేరు. అయితే ఆ శాతం చాలా తక్కువే కానీ నష్టం మాత్రం కాస్త ఎక్కువే అని చెప్పాలి.
పవన్ నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్” కు సంబంధించి పవన్ మొన్ననే షూటింగ్ లో పాల్గొనగా అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసేసాయి. ముఖ్యంగా వాటిని షేర్ చేసి ఆనందించింది కూడా దాదాపు అంతా పవన్ అభిమానులే. దీనితో మిగతా అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. సెట్స్ లో వీడియో తీసేంతగా చిత్ర యూనిట్ ఏం చేస్తున్నారని మండి పడుతున్నారు.
అలాగే ఇలా లీక్ చేస్తున్న వారిని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నవారిపై మరింత స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఇన్నాళ్ల గ్యాప్ అనంతరం చేస్తున్న సినిమా కాబట్టి ఇలా ఆగలేక ఆతృత తో ఇలా చేసేసారు అనుకోవడం కాదు ఇలాంటప్పుడే భాధ్యతను పైరసిను ఎంకరేజ్ చెయ్యకుండా భాద్యతను బయట పెట్టుకోవాలి. మరి దీనిని వారు ఎప్పుడు అర్దం చేసుకుంటారో.