ఎట్టకేలకు ముందుకుసాగుతున్న పైసా సినిమా పనులు

ఎట్టకేలకు ముందుకుసాగుతున్న పైసా సినిమా పనులు

Published on Sep 17, 2013 2:45 AM IST

nani-in-paisa

వరుస విజయాలతో ఈ మధ్య నాని చాలా ఆనందంగా వున్నాడు. అతని చేతినిండా సినిమాలు వుండడమే కాక అవన్నీ పెద్ద దర్శకుల సినిమాలు కావడం తన కెరీర్ కు కలిసొచ్చే అంశం. కాకపోతే అతనిని ఈ మధ్య ఒక విషయం బాధపెడుతుంది. ‘పైసా’ చిత్రం ఆడియో విడుదలై చాలాకాలం అవుతున్నా మిగిలిన పనులు పుర్తవ్వట్లేదు

ఈ ఆలస్యం పలు పుకార్లకు కుడా దారితీసింది. అయితే ఈ కధనాలకు ముగింపు పలుకుతూ నాని ‘పైసా’ సినిమా మిక్సింగ్ పనులు జరుగుతున్నాయని మరో వారంలో మొదటికాపీ సిద్ధమవుతుందని తెలిపాడు. ఒకసారి ఈ అవాంతరాలన్నీ తోలిగిపోతే త్వరలో తేదిని ప్రకటించే అవకాశం వుంది.

తాజా వార్తలు