ఓటీటీ సమీక్ష : మూన్ వాక్ – జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

ఓటీటీ సమీక్ష : మూన్ వాక్ – జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

Published on Jul 10, 2025 12:05 AM IST

Moonwalk Movie review

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 8, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : జియో హాట్‌స్టార్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : అనునాథ్, రిషి కైనిక్కర, సిద్ధార్థ్ బి, సుజిత్ ప్రభాకర్, అర్జున్ మణిలాల్, మనోజ్ మోసెస్ తదితరులు
దర్శకత్వం : వినోద్ ఎ.కె
నిర్మాతలు : లిజో జోస్ పెల్లిస్సరి, లిస్టిన్ స్టీఫెన్, జస్ని అహ్మద్
సంగీతం : ప్రశాంత్ పిల్లై
సినిమాటోగ్రఫీ : అన్సర్ షా
ఎడిటింగ్ : దీపు జోసెఫ్, కిరణ్ దాస్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మలయాళంలో తెరకెక్కిన ‘మూన్ వాక్’ చిత్రం తాజాగా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. యూత్‌ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

1980లలో జరిగే ఈ కథలో జాక్ (అనునాథ్), శిబూ (సిద్ధార్థ్), వరుణ్ (రిషి), షాజీ (మనోజ్), సుదీప్ (ప్రేమ్), అరుణ్ (సుజిత్) అనే కుర్రాళ్లు ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. వారికి మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ అంటే ప్రాణం. దీంతో వారు ఒక గ్రూపుగా ఏర్పడి తమ గ్రూప్‌కు ‘మూన్ వాకర్స్’ అనే పేరు పెడతారు. అయితే, తమ కుటుంబ సభ్యులు, కాలేజీలో వాళ్లు డ్యాన్స్ చేసేందుకు ఏమాత్రం ప్రోత్సహించరు. దీంతో ఆ కుర్రాళ్లు అడ్డంకుల మధ్య కూడా ఎలా డ్యాన్స్ నేర్చుకున్నారు..? ‘మూన్ వాకర్స్’ అనే తమ గ్రూప్ పేరుకు వారు ఎలాంటి న్యాయం చేశారు..? అనేది ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

1980ల కాలం నాటి కథతో వచ్చిన ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ పెద్ద ప్లస్ అయిందని చెప్పాలి. ఆ రోజుల్లో యువత ఎలా ఉండేవారు.. వారిపై ఎలాంటి ప్రభావాలు ఉండేవి.. వాటిని యువత ఎంత సీరియస్‌గా తీసుకున్నారు.. అనే పాయింట్స్‌ను చక్యగా ప్రెజెంట్ చేశారు. ఇందులో కుర్రాళ్లుగా నటించిన వారు చక్కగా పర్ఫార్మ్ చేశారు.

ఈ సినిమాలోని సంగీతం కూడా రెట్రో ఫీల్‌ను తీసుకొస్తుంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్, యవ్వనంలో వచ్చే ప్రేమ వంటి అంశాలను కూడా టచ్ చేసిన విధానం బాగుంది. కొన్ని చోట్ల ఎమోషన్స్ కూడా వర్కవుట్ అయ్యాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే డ్యాన్స్ కాంపిటీషన్ సినిమాకు చక్కటి ముగింపును అందించింది.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి రెట్రో తరహా కథాంశాన్ని తీసుకున్నప్పుడు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా చూసుకోవాలి. కానీ ఈ చిత్ర స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగుతుండటంతో ప్రేక్షకులకు కొంతమేర చిరాకు కలుగుతుంది. ఇక ఎంటర్‌టైనింగ్ అంశాలు కూడా పెద్దగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్.

కథలోకి తీసుకెళ్లే తీరు కూడా చాలా రోటీన్‌గా ఉంటుంది. ప్రేక్షకుల్లో ఎలాంటి కొత్తదనం లేని కథతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించడం మైనస్. కొన్ని సాంగ్స్ కూడా ప్రేక్షకులను మెప్పించవు.

క్లైమాక్స్ ఎపిసోడ్‌ను మరికొంత ఆసక్తికరంగా రాసుకుని ఉండాల్సింది. ఇక ఈ సినిమాను కేవలం యూత్‌ను దృష్టిలో పెట్టుకుని తీయడంతో ఈ సినిమా మిగతా ఆడియన్స్‌కు కనెక్ట్ కాదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు వినోద్ ఎ.కె ఎంచుకున్న కథ రొటీన్ అయినా, దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేసి ఉంటే ఓ చక్కటి ఎంటర్‌టైనింగ్ చిత్రంగా ఇది నిలిచేది. స్క్రీన్ ప్లే చాలా సాగదీతగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో కథ చాలా నెమ్మదిగా వెళ్తుందనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. సినిమా కాన్సెప్ట్‌ను ఎక్కడా మిస్ అవకుండా చూసుకున్నారు. ఇక సంగీతం పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు :

ఓవరాల్‌గా, ‘మూన్ వాక్’ చిత్రం యూత్‌ఫుల్ కంటెంట్‌తో వచ్చినా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. కుర్రాళ్ల పర్ఫార్మెన్స్, డ్యాన్స్ కోసం వారు పడే తపన ప్రేక్షకులను కొంతవరకు ఇంప్రెస్ చేస్తాయి. స్లో నెరేషన్, బోరింగ్ స్క్రీన్ ప్లే, సాగదీత సీన్స్ వంటివి సినిమాకు డ్యామేజ్ చేశాయి. యూత్‌ఫుల్ కంటెంట్, మలయాళ చిత్రాలను ఇష్టపడే వారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూస్తే బెటర్.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు