మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్స్‌తో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్‌లో చేయనున్నాడు.
అయితే, సుకుమార్‌తో రామ్ చరణ్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. వారందరికీ ఓ సాలిడ్ న్యూస్ చెప్పారు నిర్మాతలు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యేర్నేని తాజాగా డ్యూడ్ సక్సెస్ మీట్‌లో ఈ విషయంపై మాట్లాడారు. సుకుమార్ తన నెక్స్ట్ చిత్రంగా ‘పుష్ప-3’ని కాకుండా.. రామ్ చరణ్‌తో RC17 ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తారని.. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
దీంతో రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రం ఎలాంటి కథతో వస్తుందా.. ఈ సినిమాలో ఎలాంటి క్యాస్టింగ్ నటిస్తారా.. అనే ఆసక్తి అప్పుడే అభిమానుల్లో నెలకొంది.