అప్పుడు గోదారి గట్టు.. ఇప్పుడు మీసాల పిల్ల

అప్పుడు గోదారి గట్టు.. ఇప్పుడు మీసాల పిల్ల

Published on Oct 19, 2025 12:00 AM IST

meesala-pilla

మన టాలీవుడ్ లో పాటలు ప్రభావం ఇప్పుడు నుంచే కాదు ఎప్పుడు నుంచో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా అప్పుడు పాటలు వచ్చి సెన్సేషనల్ చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి. మరి ఇలా మన తెలుగు సినిమా నుంచి వచ్చిన బ్యాంగర్ సాంగ్స్ లో మాత్రం వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం నుంచి గోదారి గట్టు సాంగ్ ఒకటైతే ఇప్పుడు అదే దర్శకుడు సంగీత దర్శకుడు కాంబినేషన్ నుంచి వచ్చిన సాంగ్ మీసాల పిల్ల అని చెప్పాలి.

అల్టిమేట్ గా కపుల్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ సాంగ్స్ సాలిడ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. అప్పుడు గోదారి గట్టు సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తే ఇప్పుడు అది మెగాస్టార్ మీసాల పిల్లతో కొనసాగుతుంది అని చెప్పాలి. ఆల్రెడీ ఈ సాంగ్ కేవలం ఈ 3 రోజుల్లోనే 23 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఇది ముందు ముందు పెద్ద నెంబర్ కి వెళ్లినా ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.

తాజా వార్తలు