ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘కె-ర్యాంప్’

ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘కె-ర్యాంప్’

Published on Oct 18, 2025 11:03 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’ దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 18) వరల్డ్‌వైడ్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు జేన్స్ నాని డైరెక్ట్ చేయగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన లభిస్తోంది.

ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం తొలిసారి పూర్తి మాస్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్ ఎవరనే విషయాన్ని మేకర్స్ రిలీజ్ సందర్భంగా రివీల్ చేశారు. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను ఆహా దక్కించుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించగా సాయి కుమార్, నరేష్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా రాజేష్ దండ, శివ బొమ్మక్ ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు