టాలీవుడ్‌లో సెలవుల సీజన్‌లో సినిమాలు రిలీజ్ చేసి బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు హీరోలు ప్రయత్నిస్తుంటారు. ఇక ఈ క్రమంలో 2025 క్రిస్మస్ బరిలో కూడా పలు తెలుగు సినిమాలు తమ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంటున్నాయి.
ఇప్పటికే క్రిస్మస్ బరిలో అడివి శేష్ నటిస్తున్న ‘డకాయిట్’ చిత్రం రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రోషన్ మేక నటిస్తున్న ‘ఛాంపియన్’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ చిత్రాలు క్రిస్మస్ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ బరిలో మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా వచ్చి చేరింది.
ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. అయితే, ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ సినిమాలో అర్చన అయ్యర్, శ్వాసిక విజయ్, మధునందన్, రవివర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యుగంధర్ ముని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.