బండ్లన్న దివాలీ బ్యాష్.. టాలీవుడ్‌లో నయా ట్రెండ్..!

బండ్లన్న దివాలీ బ్యాష్.. టాలీవుడ్‌లో నయా ట్రెండ్..!

Published on Oct 18, 2025 10:08 PM IST

Bandla Ganesh

సాధారణంగా దివాలీ బ్యాష్ అనే పదం మనం తరుచూ బాలీవుడ్ వర్గాల్లో వింటుంటాం. అయితే, ఈ దివాలీ బ్యాష్ అనే ఈవెంట్‌ను ఎవరో ఒక సెలిబ్రిటీ హోస్ట్ చేయడం.. ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ ఈ దివాలీ బ్యాష్ ఈవెంట్‌కు హాజరవుతుంటారు. ఇక వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే, ఇప్పుడు ఈ ట్రెండ్‌ను టాలీవుడ్‌కు పట్టుకొచ్చారు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.

ఆయన తాజాగా టాలీవుడ్‌లో దివాలీ బ్యాష్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. బండ్ల గణేష్ ఇచ్చిన ఈ దివాలీ బ్యాష్‌కు టాలీవుడ్‌లోని స్టార్స్ అందరూ హాజరయ్యారు. స్టార్ హీరోలు మొదలుకొని, యంగ్ హీరోలు, హీరోయిన్స్, స్టార్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇలా అందరూ బండ్ల గణేష్ దివాలీ పార్టీకి క్యూ కట్టారు.

టాలీవుడ్‌లో ఈ దివాలీ బ్యాష్‌ను ఏర్పాటు చేసి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు బండ్ల గణేష్.

తాజా వార్తలు