రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల తరువాత ఈ అంచనాలు ఆకాశామే హద్దు అన్నతీరుగా పెరిగిపోయాయి. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ రాతి కండలు, మొరటు తీరు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వీడియోలో విజువల్స్ గూస్ బంప్స్ కలిగించాయి. ఎన్టీఆర్, చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలను పోటాపోటీగా రాజమౌళి రూపొందించారు.
ఇక ఇటీవల హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. కాగా వచ్చే ఏడాది వీలైనంత త్వరగా ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్ లోకి తీసుకు వస్తాం అని రాజమౌళి హామీ ఇస్తున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ గా అలియా భట్ ని తీసుకోడం పై రాజమౌళికి కొన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ప్రత్యేకంగా అలియాను ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ గా ఎంపిక చేయడం వెనుక కారణం ఏమిటని అనేక మార్లు రాజమౌళిని అడగడం జరిగింది.
తాజాగా మరోమారు ఈ విషయంపై రాజమౌళి స్పందించారు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ లాంటి అద్భుతమైన నటులు హీరోగా పనిచేస్తున్నారు. అలాంటి వారికి పోటీ ఇచ్చి నిలబడాలంటే ఎక్స్ ట్రీమ్లి టాలెంటెడ్ అయి ఉండాలి. ఆ టాలెంట్ అలియా భట్ కి ఉంది. అందుకే ఆమెను ఆ పాత్రకు ఎంపిక చేశాను అన్నారు. మొత్తంగా అలియా ఓ అద్భుత నటి అందుకే ప్రతిష్టాత్మక ఆర్ ఆర్ ఆర్ కి హీరోయిన్ గా తీసుకున్నానని రాజమౌళి చెప్పారు.