ఫిలిం సిటీలో ‘ఒంగోలు గిత్త’

ఫిలిం సిటీలో ‘ఒంగోలు గిత్త’

Published on Nov 27, 2012 8:30 AM IST


ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమా ఒంగోలు గిత్త షూటింగ్ రామోజీ ఫిలిం సిటీకి మారింది. చాలా వరకు గుంటూరు, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. రామ్, కృతి ఖర్బంద మీద కీలక సన్నివేశాలు ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. డిసెంబర్లో ఆడియో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆరంజ్ తరువాత భాస్కర్ చేస్తున్న సినిమా ఇదే. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. రామ్ గత చిత్రం ఎందుకంటే ప్రేమంట పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ సినిమాకి జరిగిన పొరపాట్లు ఈ సినిమాకి జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రామ్ ఈ సినిమాలో టోటల్ మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

తాజా వార్తలు