ఓటీటీ సమీక్ష : ఒక బృందావనం – ఈటీవీ విన్‌లో తెలుగు చిత్రం

ఓటీటీ సమీక్ష : ఒక బృందావనం – ఈటీవీ విన్‌లో తెలుగు చిత్రం

Published on Jun 23, 2025 6:06 PM IST

Oka Brundavanam

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 20, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : బాలు, షిన్నోవా, సాన్విత, శివాజీ రాజా, శుభలేక సుధాకర్, అన్నపూర్ణమ్మ తదితరులు
దర్శకత్వం : సత్య బొత్స
నిర్మాతలు : కిషోర్ తాటికొండ, వెంకట్ రేగెట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు
సినిమాటోగ్రఫీ : రాజ్ కే నల్లి
సంగీతం : సన్నీ – సాకేత్
ఎడిటర్ : తమ్మిరాజు, సంతోష్ కామిరెడ్డి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఫీల్ గుడ్ చిత్రంగా తెరకెక్కిన ‘ఒక బృందావనం’ జూన్ 20 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
రాజా విక్రమ్(బాలు) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. మహీ(షిన్నోవా) తన తల్లి చివరికోరికను నెరవేర్చేందుకు కష్టపడే ఓ యువతి. ఓ సాయం కోసం మహీ విక్రమ్ వద్దకు వెళ్తుంది. నైనిక(సాన్విత) అనే అనాధ చిన్నారి తనకు ప్రతిసారి క్రిస్మస్ బహుమతులు పంపే వ్యక్తిని ఎలాగైనా కలవాలని కోరుకుంటుంది. ఈ చిన్నారి విక్రమ్, మహీ లతో ఎలా కలుస్తుంది..? వారి పయనం ఎటువైపు సాగుతుంది..? విక్రమ్, మహీ ఆ చిన్నారి కోరికను నెరవేరుస్తారా..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
కొత్త నటీనటులు అయినా కూడా బాలు, షిన్నోవా చక్కటి ప్రతిభను కనబరిచారు. వారు చేసే యాక్టింగ్ న్యాచురల్‌గా ఉంటుంది. దీంతో ఈ సినిమాలోని చాలా సీన్స్ రియల్‌గా అనిపిస్తాయి.

చైల్డ్ ఆర్టిస్ట్ అయిన సాన్విత కూడా చక్కగా నటించింది. ఆమె పండించిన ఎమోషన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి మార్క్ వేసుకుంది ఈ చిన్నారి.

కళ్యాణి రాజు, శివాజీ రాజా చేసిన పాత్రలు కొంతసేపే ఉన్నా, వారు తమ పర్ఫార్మెన్స్‌తో మంచి ఎమోషన్ పండిస్తారు. ఇక మిగతా నటీనటులు కూడా తమ పాత్రలతో మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :
ఈ చిత్ర కథ సింపుల్‌గా ఉన్నప్పటికీ మంచి ఎమోషన్స్ కలిగి ఉంది. కానీ, ఈ చిత్ర పేస్ వాటిని డామినేట్ చేసి సినిమాను నీరసంగా మార్చేసింది. కొన్ని సీన్స్ వరకు సినిమా ఓకే అనిపించినా.. సెకండాఫ్‌లో ఈ సినిమా మరింత స్లోగా సాగుతుంది. సీన్స్‌ను ముందే ఊహించే విధంగా కథ సాగుతుంది.

ఎమోషనల్ అంశాలను దర్శకుడు మరింత బలంగా చూపెట్టాల్సింది. రొటీన్ కథ, స్లో నెరేషన్ కారణంగా సినిమా సైడ్ ట్రాక్ అయినట్లు అనిపిస్తుంది.

ముఖ్యంగా మహీ ఆమె తండ్రి.. విక్రమ్ అతడి తల్లిదండ్రుల మధ్య వచ్చే సీన్స్‌లో ఎమోషనల్ కంటెంట్ చాలా వీక్‌గా అనిపిస్తుంది. వీటిని మరింత ప్రభావవంతంగా చూపెట్టి ఉంటే, సినిమా ఫలితం వేరేలా ఉండేది.

శుభలేఖ సుధాకర్ పాత్రను కూడా సరిగా హ్యాండిల్ చేయలేదనిపిస్తుంది. ఆయన్ను కలిసేందుకు చిన్నారి జర్నీ ఉంటుంది కాబట్టి వీరమధ్య మరికొంత ఎమోషనల్ ట్రీట్మెంట్ ఉండి ఉంటే క్లైమాక్స్ బాగా వచ్చేది.

సాంకేతిక విభాగం :
దర్శకుడు సత్య బొత్స ఈ సినిమాను తెరకక్కించడంలో తడబడ్డాడు. అయితే, ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, సంగీతం కలిసొచ్చే అంశాలుగా నిలిచాయి. విజువల్స్ నీట్‌గా ఉన్నాయి. సాంగ్స్ కూడా కథకు అనుగుణంగా ఉండటం ప్లస్ అయింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ బాగుంది. చిత్ర రన్‌టైమ్‌ను ట్రిమ్ చేసిన తీరు బాగుంది.

తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘ఒక బృందావనం’ చిత్ర కథలో బలం లేకపోయినా, ఎమోషనల్ అంశాలు బాగున్నాయి. కొత్త నటీనటులు అయినా వారు నటించిన తీరు ఆకట్టుకుంది. రొటీన్ స్టోరీలైన్, ముందే ఊహించగల సెకండాఫ్ చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. స్లో పేస్ కారణంగా ఈ చిత్రాన్ని తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు