నందమూరి బాలకృష్ణ నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2’ అనుకోకుండా వాయిదా పడింది. గత చిత్రాల నుండి వచ్చిన ఆర్థిక సమస్యలను ప్రస్తుతం పరిష్కరించాల్సి రావడంతో నిర్మాతలు ఈ చిత్ర విడుదలను నిలిపివేశారు. ఈ అకస్మాత్తు పరిణామం అభిమానులను, సినిమా ప్రేమికులను తీవ్రంగా నిరాశపరిచింది.
అయితే,ఇప్పుడు ‘అఖండ 2’ బాటలోనే మరో సినిమా పయనిస్తుంది. కార్తీ నటించిన తమిళ చిత్రం ‘వా వాతియార్’(తెలుగులో అన్నగారు వస్తారు) కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. నిర్మాత బాకీలు చెల్లించకుండా ఉండడంపై కేసు నమోదు కావడంతో, మద్రాస్ హైకోర్టు ఈ చిత్ర విడుదలపై తాత్కాలికంగా నిలుపుదల విధించింది. దీనివల్ల సినిమా విడుదల అయోమయంలో పడింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 8కు వాయిదా పడింది.
దీంతో నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులను ముందుగానే పరిష్కరించుకుని సినిమాపై ప్రభావం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మూవీ లవర్స్ సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందో వేచి చూడాల్సిందే.


