Akhanda 2 : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ‘అఖండ 2’ రిలీజ్ ఎప్పుడంటే..?

Akhanda 2 : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ‘అఖండ 2’ రిలీజ్ ఎప్పుడంటే..?

Published on Dec 5, 2025 4:30 PM IST

Akhanda-2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ చిత్రం అఖండ 2(Akhanda 2) ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్ర రిలీజ్ విషయంలో ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తో సహా ఇతర పక్షాల మధ్య తలెత్తిన ఆర్థికపరమైన సమస్యల కారణంగా, ఈ సినిమా విడుదల చివరి నిమిషంలో ఆగిపోయింది. ఈ అనుకోని ఆటంకం తో అభిమానులు నిరాశ చెందారు. కాగా, ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చిత్ర నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పుడు, దీనికి సంబంధించిన ఓ గుడ్ న్యూస్ బయటకు వస్తుంది.

చర్చలు సఫలం.. మిగిలింది వారే..!

తాజా సమాచారం ప్రకారం వివాదంలో ఉన్న చాలావరకు పక్షాలు సానుకూలత వ్యక్తం చేయడంతో సినిమా విడుదలకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయినట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క పక్షంతో మాత్రమే చర్చలు మిగిలి ఉన్నాయి, వారితో సంప్రదింపులు మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది. ‘అఖండ 2’(Akhanda 2) రిలీజ్ పై ఏ క్షణంలోనైనా గుడ్ న్యూస్ వస్తుందనే వార్తలు వస్తున్నాయి.

ఫ్యాన్స్ ఆశలు నెరవేరేనా..?

దీంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పెండింగ్‌లో ఉన్న సమస్యలు అనుకున్నట్టుగా పరిష్కారమైతే, ఈ రోజు సాయంత్రం (డిసెంబర్ 5) ప్రీమియర్‌లు ప్రారంభించి, రేపు(డిసెంబర్ 6) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. బాలయ్య బాబు అభిమానులు, సినీ ప్రేమికులు అంతా అఖండ 2(Akhanda 2) ఆలస్యాల నుండి బయటపడి, థియేటర్లలో తమ సందడిని మొదలుపెట్టాలని ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు