రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రత్యేక ప్రదర్శన కోసం జపాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్లు జోరుగా జరుగుతుండగా, ప్రభాస్ కొత్త లుక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో, రాజాసాబ్ చిత్రంలోని ప్రభాస్ లుక్ బయటకు రాకుండా ఉండేందుకు ఆయన కొంతకాలం ఈవెంట్లకు దూరంగా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రంలో నటిస్తున్నాడు. అయినా కూడా జపాన్‌లో జరిగిన ఈవెంట్‌కి ప్రభాస్ ఎలాంటి మాస్క్, హెడ్ క్లాత్ లేకుండా హాజరుకావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్‌ను ఈ సారి లీన్ లుక్‌లో చూడడం అభిమానులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. చాలాకాలం తర్వాత మాచో లుక్‌ను విడిచి ప్రభాస్ సన్నగా కనిపించడం ఫ్యాన్స్ కొత్తగా ఫీల్ అయ్యేలా చేస్తోంది.


