హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘శంబాల’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమాను పూర్తి థ్రిల్లర్ చిత్రంగా రూపొందించారు మేకర్స్. యుగంధర్ ముని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన నైజాం హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. ఈ చిత్ర కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో అర్చన అయ్యర్, శ్వాసిక విజయ్, మధునందన్, రవివర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాను మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.


