ఈ ఏడాది ఇండియన్ సినిమా నుంచి వచ్చిన పలు క్రేజీ మల్టీస్టారర్ చిత్రాల్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం “వార్ 2” కూడా ఒకటి. మంచి హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తోనే సాలిడ్ వసూళ్లు కూడా అందుకుంది. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి అయితే ఫైనల్ గా అఫీషియల్ ఓటిటి డేట్ వచ్చేసింది.
ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇది వరకే మేము కూడా ఈ చిత్రం అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కి వస్తుంది అని తెలియజేశాము. ఇప్పుడు చెప్పినట్టే నెట్ ఫ్లిక్స్ కూడా ఇదే డేట్ ని అనౌన్స్ చేసేసారు. రేపు అక్టోబర్ 9 నుంచి హిందీ, తెలుగు ఇంకా తమిళ్ భాషల్లో ఈ సినిమా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో హృతిక్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.