హిందీలో మంచి జంప్ అందుకున్న ‘కాంతార’.. ఇది కదా కావాల్సింది!

హిందీలో మంచి జంప్ అందుకున్న ‘కాంతార’.. ఇది కదా కావాల్సింది!

Published on Oct 8, 2025 3:59 PM IST

kantara chapter 1

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రమే కాంతార చాప్టర్ 1. మంచి బజ్ నడుమ పాన్ ఇండియా భాషల్లో వచ్చిన ఈ సినిమా సాలిడ్ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది. అయితే చాలా మంది హిందిలో భారీ నంబర్స్ ఈ సినిమా సెట్ చేస్తుంది అనుకున్నారు కానీ ఈ చిత్రం ఆ రేంజ్ పెర్ఫామెన్స్ ని హిందీలో అందుకోలేదు.

అయినప్పటికీ వస్తున్న వసూళ్ళలో మాత్రం స్ట్రాంగ్ హోల్డ్ ని ఈ చిత్రం కనబరుస్తుంది. ఇలా వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత మొన్న సోమవారం 8 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకుంటే నిన్న మంగళవారం మాత్రం సాలిడ్ జంప్ అందుకొని 11.7 కోట్లకి పైగా నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. దీనితో ఇలాంటి పెర్ఫామెన్స్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ కొంచెం ఇది ఉపశమనం అని చెప్పొచ్చు. మరి ఇదే కంటిన్యూ అవుతుందో లేదో అనేది చూడాలి.

తాజా వార్తలు