ఇండియన్ సినిమా నుంచి వచ్చిన పలు ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రాల్లో మలయాళ ఇండస్ట్రీ డెలివరీ చేసిన సాలిడ్ థ్రిల్లర్ చిత్రం “దృశ్యం” కూడా ఒకటి. మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం పాన్ వరల్డ్ లెవెల్ రీచ్ ని సొంతం చేసుకుని అత్యధిక భాషల్లో రీమేక్ కూడా అయ్యింది.
ఇలా తెలుగులో వెంకీ మామ హిందీలో అజయ్ దేవగన్ లు రీమేక్ చేసిన ఈ సినిమాకి మూడో సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఒరిజినల్ వచ్చిన తర్వాతే మిగతావి రావాల్సి ఉంది కానీ రీసెంట్ గా హిందీలో ఒరిజినల్ తో పని లేకుండా పార్ట్ 3ని అనౌన్స్ చేయడంతో ఒరిజినల్ మేకర్స్ అభ్యంతరం చెప్పేసరికి దానిని హోల్డ్ లో పెట్టారు. మరి దీనిపై ఓ క్రేజీ టాక్ ఇపుడు వినిపిస్తుంది.
దీని ప్రకారం దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు, మలయాళం ఇంకా హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని ముగ్గురు హీరోలతో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్టుగా పలు రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఒకేసారి తెరకెక్కించడమే కాకుండా ఒకే రిలీజ్ లో మూడు భాషల్లో మూడు చోట్లా విడుదల చేసే యోచనలో ఉన్నారట. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి.