ఆగని ‘కాంతార 1’ వసూళ్ల హవా.. వరల్డ్ వైడ్ 8 రోజుల్లో ఎంతంటే!

ఆగని ‘కాంతార 1’ వసూళ్ల హవా.. వరల్డ్ వైడ్ 8 రోజుల్లో ఎంతంటే!

Published on Oct 8, 2025 1:08 PM IST

Kantara-Chapter-1

శాండిల్ వుడ్ రైజింగ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే కాంతార చాప్టర్ 1. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా వాటిని అందుకొని సాలిడ్ పెర్ఫామెన్స్ ని వరల్డ్ వైడ్ గా చేస్తుంది. ఇలా పాన్ ఇండియా లెవెల్లో మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 400 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిపోయింది.

కాంతార గత సినిమా లైఫ్ టైం వసూళ్ళని కేవలం ఈ కొన్ని రోజుల్లోనే క్రాస్ చేసిన ఈ చిత్రం మొత్తం 8 రోజుల్లో 427.5 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మొత్తానికి ఇలా కాంతార వసూళ్ల హవా చూపిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అలాగే హోంబళే ఫిలిమ్స్ వారు నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు