సింపుల్ టైటిల్ తో వస్తున్న SSMB29?

సింపుల్ టైటిల్ తో వస్తున్న SSMB29?

Published on Oct 8, 2025 4:59 PM IST

SSMB29

ప్రస్తుతం ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో కూడా మంచి రీచ్ ఉన్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న చిత్రం అనే చెప్పాలి. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా భారీ బడ్జెట్ అండ్ అత్యున్నత ప్రమాణ విలువలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి నవంబర్ లో గ్రాండ్ ట్రీట్ కూడా ఉంది.

అయితే ఈ సినిమాకి చాలా సింపుల్ టైటిల్ ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ రూమర్స్ ప్రకారం ‘వారణాసి’ అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసినట్టుగా ఒకటి వైరల్ అవుతుంది. కొన్ని అంతర్గత వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. అయితే ఇది వరకు కొన్ని లీక్స్ ఈ సినిమా నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భారీ సెట్టింగ్ లు వారణాసిని తలపించేలా వేశారు.

ఇపుడు వినిపిస్తున్న టైటిల్ కూడా దానికి ముడిపడింది కానీ రాజమౌళి మరీ ఇంత సింపుల్ గా తేల్చేస్తారా? అనేది కూడా ప్రశ్నగా మారింది. దీనితో పాటుగా ఆ ‘గ్లోబ్ ట్రాటర్’ అనేదే ఇంకా గ్లోబల్ లెవెల్ రీచ్ కి కూడా పనికొస్తుంది. మరి రెండు కలిపి జక్కన్న మార్కులో ఏమన్నా సెపరేట్ టైటిల్ ట్రై చేస్తారో లేదో అనేది చూడాలి. ఈ నవంబర్ లో అయితే ఏదొక బ్లాస్ట్ జరగనుంది దీనికోసం అంతా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

తాజా వార్తలు