సెన్సేషనల్ ‘కాంతార 1’.. నార్త్ అమెరికాలో మరో భారీ మైల్ స్టోన్

సెన్సేషనల్ ‘కాంతార 1’.. నార్త్ అమెరికాలో మరో భారీ మైల్ స్టోన్

Published on Oct 8, 2025 11:01 AM IST

కన్నడ స్టార్ నటుడు అలాగే టాలెంటెడ్ దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన అవైటెడ్ ప్రీక్వెల్ చిత్రమే “కాంతార చాప్టర్ 1”. దీనికి ముందు వచ్చిన చిత్రం పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టగా దానికి ముందు భాగంగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా కూడా సాలిడ్ రెస్పాన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకొని దూసుకెళ్తుంది.

మరి ఈ చిత్రం కోసం చూస్తున్న అభిమానులు అదే రీతిలో వసూళ్లు కూడా అందిస్తున్నారు. మరి ఇలా యూఎస్ మార్కెట్ లో కాంతార మరో రికార్డు మైల్ స్టోన్ అందుకుంది. ఒక్క నార్త్ అమెరికా లోనే సినిమా ఇప్పుడు 3 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని టచ్ చేసి అదరగొట్టింది. స్ట్రాంగ్ హోల్డ్ ని ప్రతీ రోజు చూపిస్తున్న ఈ చిత్రం మంచి లాంగ్ రన్ ని చూసే ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.

తాజా వార్తలు