ఎన్.టి.ఆర్ కెరీర్లోనే అత్యధిక మొత్తానికి ఓవర్సీస్ రైట్స్!

ఎన్.టి.ఆర్ కెరీర్లోనే అత్యధిక మొత్తానికి ఓవర్సీస్ రైట్స్!

Published on Nov 26, 2012 6:16 PM IST


మేము విన్న సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ ఓవర్సీస్ రైట్స్ అత్యధికంగా సుమారు 4.5 కోట్లకి అమ్ముడుపోయాయి. బాగా ఉత్కంఠంగా జరిగిన ఈ పోటీలో గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ బ్యానర్ వారు రైట్స్ ని దక్కించుకున్నారు. ఈ విషయంలో శ్రీను వైట్ల కొంచెం పర్సనల్ గా రెకమండ్ చేయడంతో వాళ్ళు ఈ రైట్స్ దక్కించుకున్నారు. మామూలుగానే శ్రీను వైట్లకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది దానికి ఎన్.టి.ఆర్ లుక్ మరియు పాత్ర కొత్తగా ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మామూలుగా యంగ్ టైగర్ కి రూరల్ ఏరియాల్లో మరియు చిన్న టౌన్స్ లో హై మార్కెట్ ఉంది. అర్బన్ ఏరియాల్లో కూడా తన మార్కెట్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాతో ఎన్.టి.ఆర్ తను అనుకున్నది రీచ్ అయ్యే చాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.

తాజా వార్తలు