ఆగష్టు రెండవ వారంలో బ్యాంకాక్ వెళ్లనున్న ఎన్.టి.ఆర్


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చాలా స్టైలిష్ గా కనిపించనున్న చిత్రం ‘బాద్షా’. ఈ చిత్రం చిత్రీకరణ కోసం ఆగష్టు 11న ఎన్.టి.ఆర్ బ్యాంకాక్ వెళ్లనున్నారు. ఇటీవలే ఈ చిత్రం యూరోపియన్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తునారు. యాక్షన్ అంశాలు కలగలిపిన కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ కథా రచయితలయిన కోనా వెంకట్ మరియు గోపి మోహన్ లు కథనందించారు.

‘బాద్షా’ చిత్రాన్ని 2013 జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version