యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాధ్దా’ సినిమా కోసం స్టైల్ మార్చుకునే పనిలో పడ్డాడు. ఇటీవలే ‘దమ్ము’ సినిమాలో నీట్ గా షేవ్ చేసుకొని మీసాలు పెంచి ఆకట్టుకున్న ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల డైరెక్షన్లో షూటింగ్ ప్రారంభం కానున్న ‘బాద్షా’ కోసం గెడ్డం పెంచి డిఫరెంట్ లుక్ తో రాబోతున్నాడు. ఇటీవల జరిగిన దమ్ము సకసేస్ మీట్ కి ఈ లుక్ తోనే వచ్చిన ఎన్టీఆర్ ఈ సినిమాలో డాన్ లాంటి పాత్ర చేయనున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లు బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకుంటున్నాడట. ఇటీవలే సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఊటీలో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించిన ఈ చిత్ర బృందం ఈ నెల 10వ తేదీ నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటించనున్న ఈ సినిమాని బండ్ల గణేష్ బాబు నిర్మించనున్నారు.