ఆ టైటిల్ కి నరేష్ మాత్రమే న్యాయం చెయ్యగలడు

ఆ టైటిల్ కి నరేష్ మాత్రమే న్యాయం చెయ్యగలడు

Published on Nov 26, 2012 12:31 PM IST


కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘యముడికి మొగుడు’. ఈ సినిమా ఆడియో వేడుక నిన్న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ చంటి గారు ఈ టైటిల్ నరేష్ తీసుకున్నాడు అనగానే ఆశర్యపోయాను కానీ ఇప్పట్లో ఆ టైటిల్ కి నరేష్ మాత్రమే న్యాయం చేయగలడు. నాకు ‘మగధీర’ ఎలాగో నరేష్ కెరీర్లో ఈ మూవీ కూడా అలా నిలిచిపోవాలి, అలాగే నరేష్ ‘చంటబ్బాయ్’ సినిమా కూడా తీయాలని నరేష్ ని కోరుతున్నానని’ అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా కి కథానుసారం కరెక్ట్ గా సూట్ అయ్యే టైటిల్ ఇదే. ఇలాంటి పాయింట్ ఇంతక ముందు రాలేదు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆశిస్తున్నానని’ అన్నాడు. అలాగే ఈ వేడుకలో వి.వి వినాయక్, నాని, తనీష్, వైభవ్, బి. గోపాల్, భీమనేని శ్రీనివాస్, రిచా పనాయ్ తదితరులు పాల్గొన్నారు. ఇ. సత్తిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి కోటి సంగీతం అందించారు.

తాజా వార్తలు