ఇక పవన్ నుంచి ఫిక్స్ అయ్యిపోవచ్చా..?

ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన లేటెస్ట్ లుక్ బయటకు వచ్చింది దీనితో ఈ కొత్త మేకోవర్ ను చూసి పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్ కు గాను చాలా కాలం విరామం అనంతరం షేవ్ లుక్ లో దర్శనం ఇచ్చే సరికి మళ్లీ పవన్ అభిమానులకు ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది.

ఇన్నాళ్ళు చాతుర్మాస దీక్ష పేరిట గుబురుగా గడ్డం పెంచేసి సాధువులా మారిపోయారు కానీ ఫైనల్ గా షేవ్ చేసే సరికి వకీల్ సాబ్ అప్డేట్ కి లైన్ క్లియర్ అయ్యినట్టే అని టాక్ వినిపిస్తుంది. గత కొన్నాళ్ల నుంచి వకీల్ సాబ్ టీజర్ కోసం అంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఆశలు మరింత చిగురించాయి. పవన్ ఎలాగో షూటింగ్ మొదలు పెట్టేసారు కాబట్టి ఈ దీపావళి పండుక్కే టీజర్ ను ఎక్స్పెక్ట్ చేసినా పెద్ద ఆశ్చర్యం లేదు. మరి దర్శకుడు శ్రీరామ్ వేణు నిర్మాత దిల్ రాజుల మదిలో ఏముందో తెలియాల్సి ఉంది.

Exit mobile version