ఆమెతో నితిన్ ఎంగేజ్మెంట్ ఆరోజేనట.

త్వరలో యంగ్ హీరో నితిన్ ఓ ఇంటివాడు అవుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన షాలిని అనే అమ్మాయిని ఈ ఏడాది ఏఫ్రిల్ 6న దుబాయ్ వేదికగా ఘనంగా మ్యారేజ్ చేసుకోనున్నారు. కాగా ఈ జంట ఈనెలలోనే ఎంగేజ్మెంట్ జరుపుకోనున్నారట. హైదరాబాద్ వేదికగా సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఫిబ్రవరి 15న ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఘనంగా జరగనుందని సమాచారం. నితిన్ మరియు షాలిని కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు.

ఇక నితిన్-రష్మిక మందాన జంటగా దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ మూవీ ఈనెల 21న విడుదల కానుంది. దర్శకుడు రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మహతి స్వర సాగర్ భీష్మ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన భీష్మ టీజర్ మరియు సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

Exit mobile version