నిఖిష పటేల్ ఎట్టకేలకు మూడో చిత్రం ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ సరసన “పులి” చిత్రం చేసిన తరువాత ఈ కథానాయిక మరో చిత్రం ఒప్పుకోలేదు ఈ మధ్యనే కళ్యాణ్ రామ్ తీస్తున్న 3డి చిత్రం “ఓం” మాత్రమే ఈ భామ చేస్తున్న చిత్రం. తాజా సమాచారం ప్రకారం ఈ భామ మూడవ చిత్రం ఒప్పుకుంది సాయి రామ్ శంకర్ కథానాయకుడిగా రవి దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో ఈ భామ నటించబోతుంది. ఈ చిత్రాన్ని కే.సాగర్ నిర్మిస్తున్నారు ఈ చిత్రాలు కాకుండా నిఖిష మరో రెండు తమిళ మరియు మలయాళ చిత్రాలను చేస్తున్నారు. చూస్తుంటే నిఖిష తన కెరీర్ నడుస్తున్న విధానం పట్ల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తుంది.