ప్రభాస్ సినిమా టైటిల్ మారిందా ?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదట్లో ‘జాన్’ టైటిల్ అనుకున్నారు. ఇదే ప్రేక్షకుల్లో బాగా రిజిస్టర్ అయింది. కానీ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో ‘ఓ డియర్, రాధేశ్యామ్’ అనే రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించారు. దీంతో సినిమాకు టైటిల్ మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే రెండింటిలో ఏ టైటిల్ పెడతారు, అసలు ఈ పేర్లను ఈ సినిమా కోసమే రిజిస్టర్ చేశారా లేకపోతే వేరే సినిమాల కోసం ఎంచుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ‘సాహో’ చిత్రం ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమాపైనే ప్రేక్షకులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. పైగా గతంలో ప్రభాస్ చేసిన ప్రేమ కథా చిత్రాలు ‘డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్’ మంచి విజయాలని అందుకోవడంతో
ఈ సినిమా కూడా ఆయనకు కలిసొస్తుందని అంటున్నారు. ప్రభాస్ సైతం ఈ సినిమాను చాలా జాగ్రత్తగా చేస్తున్నారు.

Exit mobile version